Andhra
ప్రకాశం జిల్లాలో యూరియా కొరతలేదని స్పష్టం చేసిన కలెక్టర్..
ప్రకాశం జిల్లాలో ఎక్కడ యూరియా కొరతలేదని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా స్పష్టం చేశారు. బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో జరిగిన కలెక్టర్ల సమావేశంలో యూరియా కొరతపై చర్చ నడిచింది. ఆ సమయంలో సీఎం చంద్రబాబు జిల్లాలలోని పరిస్థితులను కలెక్టర్ తమిమ్ అన్సారియా నుంచి అడిగి తెలుసుకున్నారు. యూరియా కొరతపై కలెక్టర్ ని సీఎం ప్రశ్నించగా రైతులకు యూరియా అందుబాటులో ఉందని ఎప్పటికప్పుడు అధికారులతో ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తున్నట్లు సీఎంకు కలెక్టర్ తెలిపారు.
![]()
