Andhra
ఖబ్జాకు గురైన వాగు పోరంబోకు భూమిని స్వాధీనం చేసుకున్న తహశీల్దార్..
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బొందలపాడులో వాగు పోరంబోకు భూమిని కొంత మంది రైతులు ఆక్రమించారని గ్రామస్థుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి భూమిని సర్వే చేయించి, అందులో 91.49 సెంట్ల వాగుపోరంబోకు భూమి ఉందని తేల్చి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తహశీల్దార్ హెచ్చరించారు.
![]()
