Andhra
బదిలీ ఐన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలి: ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రజాక్
AP:రాష్ట్రం లో రెండునెలల వేతనాలు అందే పరిస్థితి లేకపోవడంతో ఉపాధ్యాయులకు దిక్కుతోచడంలేదని ప్రతినెలా తప్పనిసరిగా చెల్లించాల్సిన ఈఎంఐలు, ఇతర ఖర్చులను ఒకనెల ఉపాధ్యాయులు ఏదోలా సర్దుకున్నారు అని,ఇప్పుడు పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు అని మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ అన్నారు.దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకుని బదిలీ అయిన ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించాలని , జూలై నెల వేతనాలు ఆగస్టు ఒకటో తేదీన జమగాకపోతే బ్యాంకు రుణాలు తీసుకున్న ఉపాధ్యాయులు డిఫాల్టర్లుగా మారిపోతారు. ఇప్పటికే ఒకనెల వేతనాలు అందకపోవడంతో నోటీసులు అందుతున్నాయి. పొజిషన్ ఐడీలు మంజూరు చేసి వేతన బిల్లులు సమర్పణ కోసం గడువును ఈ నెల చివరివరకు పెంచాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
![]()
