Connect with us

Andhra

వాస్తవాలకు పొంతన లేకుండా తీసిన హరిహర వీరమల్లు సినిమా యూనిట్ పై కేసు నమోదు చెయ్యాలి.. యంపీజే

Published

on

దేశంలో మతసామరస్యం దెబ్బతీసెందుకు, వాస్తవానికి సంబంధం లేని కాల్పనిక కధతో సినిమా తీసి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేసినందుకు డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్ మరియు హరిహర వీర మల్లు చిత్ర యూనిట్ పై కోర్టు సుమోటోగా స్వీకరించి కేసులు నమోదు చేయాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ కోరారు. వాస్తవాలకు పొంతన లేకుండా ఔరంగజేబు 16 వ శతాబ్దంలో గోల్కొండపై దాడి చేస్తే ..13వ శతాబ్దానికి చెందిన హరిహర వీర మల్లుతో పోరాడటం ఏంటని, ఇది పూర్తిగా నిరాధారమైన, అవాస్తవాలతో కూడిన సినిమా అని ఆయన దుయ్యబట్టారు. వాస్తవానికి ఔరంగజేబు 1687లో గోల్కొండను దండయాత్ర చేసినప్పటి ఆయన వయసు 60 సంవత్సరాలు పైనే.. హరిహర వీరమల్లు చనిపోయి అప్పటికే 200 సంవత్సరాలు అయింది.. మరి ఔరంగజేబు vs వీరమల్లు యుద్ధం ఎలా చేశారు..?? చార్మినార్ 1591 లో కట్టారు… హరిహర వీరమల్లు 1355 లో చనిపోయాడు. సినిమాలో చార్మినార్ దగ్గర యుద్ధం ఎలా జరిగింది..? ఇవన్ని కల్పితమైన, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి డబ్బులు సంపాదించే ఉద్దేశ్యంతో చేసిన ప్రయత్నం మాత్రమే. ఒక వర్గం వారిపై విషం కక్కుతూ తీసిన సినిమా మాత్రమే అని మేము భావిస్తున్నాం. పైగా సినిమా రిలీజ్ అయిన వెంటనే ఇక ధర్మం యుద్దం ప్రారంభం అయినట్లు, సినిమాకూ నెగిటివిటి చేసే వారిపై దాడులు చేయమని ఫ్యాన్స్ ను రెచ్చగొట్టడం ఆయన ఆలోచన విధానం అర్ధం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వెంటనే కల్పించుకొని సినిమాపై నిషేధం విధించాలని, సినిమా యూనిట్ మరియు పవణ్ కళ్యాణ్ లు హరిహర వీరమల్లు సినిమా కల్పితమైనదని ప్రకటించి, బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.