Connect with us

Andhra

శ్రీశైలం శాలివాహన అన్నదాన సత్రం అధ్యక్షుడిగా మోహన్ రావు..

Published

on

శ్రీశైలం శాలివాహన అన్నదాన సత్రం నూతన అధ్యక్షుడుగా చాతరాజుపల్లి (కుమ్మరి) మోహన్ రావు ఎన్నికయ్యారు. విజయవాడలో శాలివాహన సమావేశం ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐలాపురం వెంకయ్య ఆద్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా శాలివాహన నాయకులందరూ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన చాతరాజుపల్లి మోహన్ రావును ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. మోహన్ రావు బిసి నాయకులుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. చాతరాజుపల్లి మోహన్ రావు తండ్రి శాలివాహన సంఘానికి, శ్రీశైలం శాలివాహన అన్న సత్రానికి ఎనలేని కృషి చేశారు. ప్రస్తుతం మోహన్ రావు తమ్ముడు చాతరాజుపల్లి మరదలు చాతరాజుపల్లి అంజమ్మ శ్రీనివాసులు మార్కాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ గా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన తమ్ముడు చాతరాజుపల్లి శ్రీనివాసులు, బాలయ్య, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అభినందనలు తెలియజేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.