Andhra
జర్నలిస్టుల పిల్లలలకు ప్రతి చోట 50 శాతం రాయితీ ఇవ్వాలి:APWJS రాష్ట్ర అధ్యక్షులు కాటా రామారావు చౌదరి
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య రాష్ట్ర సమావేశం గుంటూరులోని ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అప్పల నాయుడు అధ్యక్షత వహించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చల్లగుండ్ల రామకృష్ణ ఖర్చు వివరాలను రాష్ట్ర సమావేశంలో సభ్యులకు తెలియజేశారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జిల్లా అధ్యక్షులు హాజరై నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కాటా రామారావును, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ అబ్దుల్ రజాక్ ను, క్రమశిక్షణ చైర్మన్ గా షేక్ ముస్తఫా ఎన్నికను సభ్యులు ఆమోదం తెలియజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కాటా రామారావు మాట్లాడుతూ ఏపీడబ్ల్యూజేఎస్ రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ వస్తుందని, అర్హత గల ప్రతి జర్నలిస్టుకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని, సీనియర్ జర్నలిస్టులకు ప్రతి కాలేజీ 50 శాతం రాయితీ ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు.దీనిపై సంస్థ తీర్మానం చేసిందని, ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
![]()
