Andhra
ఘనంగా రెవిన్యూ దినోత్సవం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెవెన్యూ దినోత్సవాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లో విశిష్టంగా నిర్వహించారు. సబ్ కలెక్టర్ శ్రీ బి. సహాదిత్ వెంకట త్రివినాగ్ నేతృత్వంలో రెవెన్యూ ఉద్యోగులతో కూడిన ర్యాలీ కార్యాలయం నుండి ప్రారంభమై గడియార స్థంభం వరకు కొనసాగింది. అనంతరం మానవహారం నిర్వహించి ఈ కార్యక్రమంలో “రెవెన్యూ సేవ అంటే రైతులకు సేవ” అనే నినాదంతో, శ్లోకాలతో కూడిన ప్లకార్డులు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తదనంతరం ఉద్యోగుల సన్మానం, పుస్తక ప్రదర్శనలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ప్రజల్లో రెవెన్యూ వ్యవస్థపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించామని సబ్ కలెక్టర్ తెలిపారు.
![]()
