Connect with us

Andhra

శ్రీ చైతన్య విద్యాసంస్థల ఫీజుల దోపిడి అరికట్టాలి*

Published

on

ఈ రోజు విజయవాడ బందర్ రోడ్ నందు ఉన్న శ్రీ చైతన్య ఇందిరా టవర్స్ వద్ద విద్యా సంస్థ దోపిడి అరికట్టాలని నిరసన వ్యక్తం చేస్తున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఏఐఎస్ఎఫ్) నాయకులపై పోలీసులు అత్యుత్సాహం చూపించారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి వలరాజు, బందెల నాసర్ జీ, ఉపాధ్యక్షులు సాయి కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్సులు ఫణింద్ర , షాబీర్ బాషా, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కార్తీక్, రాష్ట్ర సమితి సభ్యులు సాదిక్, రంగస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ఇంటర్ బోర్డు అధికారి వస్తున్నారని సంఘ నాయకులు పోలీసులకు తెలియజేసిన కూడా నాయకులు పై దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారని రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్సులు తెలియచేసారు. రౌడీలతో వ్యవహరించినట్టుగా విద్యార్థి సంఘ నాయకుల పై వ్యవహరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత స్పందించాలని డిమాండ్ చేసారు. పాఠ్యపుస్తకాల పేరుతో, మెయిన్స్, ఐఐటి, నీట్ పేరుతో తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న చైతన్య విద్యాసంస్థల దోపిడీకి రాష్ట్ర పోలీసు వ్యవస్థ మద్దతు తెలపడం సిగ్గుచేటని అన్నారు. అనంతరం సంఘ నాయకులను అరెస్టు చేసి మాచవరం పోలీస్ స్టేషన్కు తరలించారని నాయకులు తెలిపారు. నాయకులను సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరావు మాచవరం పోలీస్ స్టేషన్ కు వచ్చి పరామర్శించారు. చైతన్య విద్యా సంస్థల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ నాయకులకు రాష్ట్ర అధ్యక్ష,, కార్యదర్శులు వలరాజు, బందెల నాసర్ జీ పిలుపునిచ్చారు

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.