Connect with us

Andhra

బైక్‌ని ఢీకొట్టిన లారీ ఒకరు మృతి

Published

on

నెల్లూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాలపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ నిత్యం ఏదో ఓక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. తమ గమ్యస్థానాలకు వెళ్లాలనే తొందరలో వాహనాలను అతివేగంగా నడుపుతూ యాక్సిడెంట్‌లకు గురవుతున్నారు. కుటుంబ సభ్యులు మృతిచెందుతుండటంతో ఆయా కుటుంబాలు తీవ్ర శోకంలో మునిగిపోతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలోని వెంకటాచల మండలం కాకర్లవారిపాలెంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని వెంకటాచల మండలంలో గల కాకర్లవారిపాలెంలో ట్రాన్స్మిట్ మిక్సర్ లారీ ఢీకొని ఒకరు మృతిచెందారు. తాటిపర్తివారిపాలెంకి చెందిన గుమ్మ వెంకటరామయ్య (54) బైకుపై వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. న్యాయం చేయాలంటూ మృతదేహంతో రోడ్డుపై కుటుంబసభ్యులు, బంధువులు బైఠాయించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.