Connect with us

Andhra

బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం: మౌలానా ముస్తాక్ అహ్మద్

Published

on

మార్కాపురంలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు టీడీపీ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తీవ్ర దిగ్భ్రాంతి మరియు గాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ తరహా ప్రమాదాలు సమాజాన్ని కలచివేస్తాయని, బాధిత కుటుంబాల వేదనను మాటల్లో వ్యక్తం చేయలేమని ఆయన పేర్కొన్నారు.ఈ దుర్ఘటనలో తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు మనమంతా అండగా నిలవాలని, ఈ క్లిష్ట సమయంలో వారికి ధైర్యం చెప్పడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.