Connect with us

Andhra

నంద్యాలలో SIR పై అవగాహన, సహాయం సేవా కేంద్రం…

Published

on

ఏపిలో ఓట్ల గల్లంతు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, సేవా కేంద్రం సద్వినియోగం చేసుకోండి – సమద్

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణా లేదా స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ సవరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రేల్ నుండి అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తరుపున ప్రస్తుతానికి ఈ ప్రక్రియపై ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించలేదు. సర్ ఓటు సవరణకు 2002 సంవత్సరం ప్రమాణికంగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సామాన్య ప్రజానీకం, పేద, నిరాక్షస్యత వల్ల ఓటర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ తన వంతుగా ప్రజలకు అవగాహన కల్గించే 2002 ఓటర్ లిస్టులో తమ ఓటు గుర్తించి ప్రిజినీ చేయించుటకు సహాయం చేస్తుంది. ఈ నేపథ్యంలో నంద్యాల అంటి కోట మస్జిద్ లో సహాయక కేంద్రాన్ని స్థానిక జేఐహెచ్ అధ్యక్షులు అబ్దుల్ సమద్ లాంఛనంగా ప్రారంభించారు. ముస్తాఖ్ అహ్మద్, సాజిద్ హుసేన్, ఆరీఫ్, అహమ్మద్ యువకులు తమ ల్యాప్ ట్యాప్ లో ఇంటి నెం, ఓటర్ ఐడి ద్వారా ఓటర్ల లిస్టు లో పేర్లు గుర్తిస్తున్నారు. తద్వారా స్థానిక బూత్ లెవెల్ ఆఫీసర్ (బియల్ఒ) కు మ్యాపింగ్ లో సులభతరం అవుతుంది. ఈ సంధర్భంగా సమద్ మాట్లాడుతు తమ సమయం వెచ్చించిన యువతకు అభినందిస్తు, ఆదివారం వరకు కొనసాగే ‘సర్’ ఓటు సవరణలో ప్రజలు సేవలు పొందవచ్చని ఆహ్వానించారు. మొదటి రోజు మూడొందల మంది తమ సేవలు సద్వినియోగం చేసుకోవడం శుభసూచకం అన్నారు. ఈ కార్యక్రమంలో జమాత్ జిల్లా బాధ్యులు హాఫీజ్ జమాన్, సి. యం. జకరియా, ఇమాం హాఫీజ్ హబీబుల్లాహ్, అబ్బాస్ అలీ, అబ్దుల్ రషీద్, దాదాపీర్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.