Andhra
షాదీఖానాను త్వరలో పూర్తి చేస్తాం.. ముస్తఖ్ అహ్మద్
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణం టీడీపీ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి సతీమణి ఇటీవల మరణించిన నేపథ్యంలో, వారి కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు టీడీపీ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించి ముస్తఖ్ అహ్మద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, టీడీపీ పార్టీ విధానాలు మరియు ముస్లిం మైనారిటీల అభివృద్ధి గురించి వివరించారు. అలాగే మార్కాపురం పట్టణంలో షాది ఖానా నిర్మాణం అవసరాన్ని ప్రస్తావిస్తూ, త్వరలోనే దీనిపై చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యద్ సాదిక్, పట్టణ సీనియర్ టిడిపి మొగల్ ఫిదా హుస్సేన్ బేగ్, ఖాన్, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు మొగల్ జాబీర్ హుస్సేన్ బేగ్, ఉపాధ్యక్షులు చిన్న ఖాసిం, యువ నాయకుడు షాకీర్ బేగ్, కౌన్సిలర్ చిన్న షెక్షావలి, పాలవలి, కాసిం సాహెబ్, షేక్ నాసర్, కరీం భాషా, షఫీ, మౌలాలి, నూరుల్లా, రహమాన్, షేక్ తాజ్, ఖాదర్ మస్తాన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
![]()
