Andhra
బ్యాంక్ క్లర్క్ లుగా ఎంపికైన ముగ్గురు ‘రేస్’ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు..
మార్కాపురం: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నేడు ప్రకటించిన ఫలితాలలో మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని రామానుజన్ అకాడమీ ఆఫ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ( RACE) కోచింగ్ సెంటర్ నందు శిక్షణ తీసుకున్న ముగ్గురు విద్యార్థులు వివిధ బ్యాంకులలో క్లర్క్ లుగా ఎంపికైనట్లు ‘రేస్’ సంస్థ గౌరవ సలహదారులు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలాని, సంస్థ డైరెక్టర్ బత్తుల లక్ష్మీ నారాయణలు తెలిపారు.
‘రేస్’ సంస్థలో’ శిక్షణ పొందిన పఠాన్. తాహుర్ (ROLL NO : 114300 5412) పంజాబ్ నేషనల్ బ్యాంక్, యలకపాటి హెప్సిబా (Roll No: 1143013189) పంజాబ్ అండ్ సింథ్ బ్యాంకు, కురవటి వెంకటేష్ (Roll No: 3263000787) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (CSA) లుగా ఎంపికైనట్లు ‘రేస్’ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమములో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అభినందించారు. ‘రేస్’ ఇన్స్టిట్యూట్ లో అత్యుత్తమ శిక్షణ, పరీక్షల నిర్వహణ, పరీక్షా పేపర్ల వివరణ, విశ్లేషణ తరగతులు క్రమం తప్పకుండ నిర్వహించడం వల్ల తాము ఉద్యోగం సాధించినట్లు విజేతలు తెలిపారు. ఈ కార్యక్రమములో ‘రేస్’ సంస్థ అధ్యాపకులు నాగేశ్వరరావు, సుబ్బయ్య, నర్సయ్య, కృపాచారి, సత్యనారాయణ, వెంకట్, ప్రదీప్, శ్రీనివాస్ మరియు ఇతర అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
![]()
