Connect with us

Andhra

ఆరోగ్యం పౌరుల ప్రాథమిక హక్కుఅని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని యంపిజే స్వాగతిస్తుంది..

Published

on

ప్రజల ఆరోగ్యంతో ఆట్లాడుకోవడం మానుకోవాలని సుప్రీంకోర్టు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)ను హెచ్చరించడాన్ని, అలాగే ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేయడం, ప్రజారోగ్యం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పడాన్ని మరియు ఇకపై ప్యాకేజ్డ్ ఆహారంపై ‘హెచ్చరిక ముద్ర తప్పనిసరి’గా ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని యంపీజే స్వాగతిస్తుందని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ తెలిపారు.

భారత రాజ్యాంగం భారత పౌరులకు ఆహార భద్రత (RIGHT TO FOOD) కల్పించిందని, అయితే దేశంలో, రాష్ట్రంలో కల్తి మరియు రసాయనాలతో ఆహార పదార్థాలను మరియు వస్తువులను ఇష్టరాజ్యంగా విక్రయిస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజల ప్రాణాలతో ఆట్లాడుకోవడం తగదని అబ్దుల్ రజాక్ అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి 28 జిల్లాలుగా మారిన ఫుడ్ సేఫ్టీ అధికారులు (ఇన్స్పెక్టర్లు) జిల్లాకు ఇద్దరు చొప్పున ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కేవలం అడపాదడపా ఫుడ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయడం తప్ప క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడాన్ని, ఈ ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలకు ఎంత విలువ ఇస్తున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. ప్రజల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులను పెంచాలని, అలాగే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు ముమ్మరం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.