Andhra
జాతియగణిత దినోత్సవాన్ని ఘనంగా జరిపిన శ్రీ సాయిబాలాజి విద్యా సంస్థ..
మార్కాపురం: గణితంలో దిట్ట, మేటి అయిన శ్రీ శ్రీనివాస రామనుజన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని మార్కాపురం పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
‘మ్యాథ్స్ బజార్’ పేరు మీదుగ పిల్లలకు గణితంలో పట్టువచ్చే విధంగ వివిధరకాల వస్తువులను ఎలా కొనాలి, ఏలాఅమ్మాలి అనే వాటిపై పూర్తి అవగాహన కల్పించారు. “మ్యాథ్స్ పార్క్” పేరు మీదుగ వివిధ రకాల గణిత నమూనాలను విద్యార్థుల చేత చేయించారు. అవి చూపరులకు కనువిందు చేశాయి. 6 నుండి 10 వ తరగతి విద్యార్థులకు “మ్యాథ్స్ బ్రెయిన్ బూస్టర్” పేరు మీద టాలెంట్ టెస్ట్ నిర్వ హించారు. ఈ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి పాఠశాల డైరెక్టర్ పి. ప్రకాశరావు ప్రారంభించారు. అలాగే గణిత ఉపాధ్యాయ బృందం చాలచక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పాఠశాల ప్రిన్సిపల్ సయ్యద్ మస్తాన్ వలి, గణిత టీచర్స్ విద్యాబృందం రామానుజన్ పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమాల తీరును విద్యార్థులు తిలకించి విజ్ఞానాన్ని పొందారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, బహుమతులు ఇచ్చి, ఈ కార్యక్రమాన్ని ఇంఛార్జిలు సుభాషిణి, శాంతిలు ముగింపు పలికారు.
![]()
