Andhra
మతాలకు అతీతంగా లెప్రసీ రోగులకు సేవ చేసి ప్రేమ పంచిన MPJ..
కాకినాడ: మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ((MPJ) కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలలో పదిహేను రోజులకు ఒకసారి జరిగే సేవా కార్యక్రమం భాగంగా నేడు (10/12/2025) మధ్యాహ్నం 12 గంటలకు (RTC బస్టాండ్ దగ్గర వున్న హిందూ స్మశాన వాటిక దగ్గర) గల లెప్రసీ కాలనీలో 50 మంది లెప్రసీ పేషెంట్స్ డ్రెస్సింగ్ చేయడంతో పాటు వారందరికీ స్నాక్స్ పంపిణి చేసింది. ఈ కార్యక్రమము MPJ జిల్లా అధ్యక్షులు MD హలీం ఆర్థిక సహాయం (₹2000) చేయడం ద్వారా జరిగింది. MPJ కాకినాడ జిల్లా తరపున MD హలీంకి ధన్యవాదములు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు MD. హలీం, MD ఉస్మాన్ షబ్బీర్, షాకీర్, MD కలీం, నాయన రాజు, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
![]()
