Andhra
అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కందుల..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఈరోజు మార్కాపురం పట్టణంలోని అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం క్యాంటీన్ కు విచ్చేసిన ప్రజలను పలుకరిస్తూ భోజనం ఎలా ఉంది, ఏమైనా మార్పులు చేయాలా అని ప్రతి ఒక్కరికి అడిగి కనుక్కున్నారు. వచ్చిన వారు భోజనం బాగా నాణ్యంగా ఉందని తెలిపారు.
![]()
