Andhra
మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఏర్పాట్లను తనిఖీ చేసిన MEO సుజాత..
తర్లుపాడు: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన మండల విద్యా శాఖ అధికారి దేవరకొండ సుజాత. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, లైబ్రరీ బుక్స్, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర కిట్స్, FLN కిట్స్, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, తల్లికి వందనం లాంటి ప్రభుత్వం కల్పించే అన్ని సౌకర్యాలను పేరెంట్స్ కు వివరించాలని మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలాలి, విద్యార్థులు పాల్గొన్నారు.
![]()
