Andhra
మార్కాపురం జిల్లా, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చెయ్యడమే నా జీవిత లక్ష్యం.. ఎమ్మెల్యే కందుల
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జన్మదినాన్ని నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు వందలాదిగా పాల్గొని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. నేను రెండు వాగ్దానాలు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చానని, అందులో ఒకటి మార్కాపురంను జిల్లాగా చేయడం, రెండోది వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమని, ఈ రెండు పూర్తయితే నా జీవిత లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. అలాగే నాకు కార్యకర్తలు అంటే ప్రాణమని, వారి ఋణం తీర్చుకుంటానని, వారికి ఎటువంటి కష్టం లేకుండా చూస్తానని, కష్టం అనేది నాకు తెలుసని, ఆ కష్టం కార్యకర్తలకు రానివ్వనని..కొద్ది కాలం సహనం వహించాలని ఉద్వేగంతో అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ సుబ్రహ్మణ్యం, పట్టణ టిడిపి అధ్యక్షులు పఠాన్ ఇబ్రహీం ఖాన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
