Andhra
ర్యాక్సీ డాగ్ లతో మార్కాపురం పరిసర ప్రాంతాలను ముమ్మర తనిఖీలు చేసిన పోలీసులు..
మార్కాపురం: ఢిల్లీలో బాంబు దాడి జరిగిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో మార్కాపురం సబ్ డివిజన్ లో రాక్సీ పోలీసు డాగ్ తో తనిఖీలు చేసిన పోలీసులు.
మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ , రైల్వే స్టేషన్, కంభం బస్టాండ్ సెంటర్, దోర్నాల బస్టాండ్ సెంటర్ తో పాటు చెన్నకేశవ స్వామి టెంపుల్, పూల సుబ్బయ్య కాలనీ పరిసర ప్రాంతాలలో రాక్సీ డాగ్ తో విస్తృతంగా పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ లోపల ప్రదేశంలో ప్రయాణీకుల బ్యాగులను తనిఖీలు చేశారు. అంతేకాకుండా అనుమానం వచ్చిన ప్రయాణికుల బ్యాగ్ లను ఒపెన్ చేయించి తనిఖీలు చేశారు. అలాగే బస్టాండ్ లో ఉన్న పార్సిలు సర్వీసు సెంటర్ ను తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్, దేవాలయాల పరిసరాలలో ర్యాక్సీ డాగ్ లతో జల్లెడ పట్టారు. మార్కాపురం ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఎర్పట్లు చేస్తున్నామని సిఐ పి సుబ్బారావు అన్నారు.
ఈ తనిఖీలలో మార్కాపురం ఇన్స్పెక్టర్ సుబ్బారావు, మార్కాపురం రూరల్ ఎస్సై అంకమ్మరావు, డాగ్ హ్యాండ్లర్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
![]()
