Connect with us

Andhra

దళితులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.. వీరయ్య మాదిగ

Published

on

చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని బంధముడి గ్రామంలో AP. MRPS దళితులపై అగ్రవర్ణాల దాడికి గురైన వారిని పరమార్శించి, ఈ దాడిని ఖండిస్తున్నామని A. P. MRPS రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య మాదిగ చెప్పారు. దళితులపై దాడులను అరికట్టడానికి 1989లో SC. ST ఆత్యాచారాల నిరోధక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించినప్పటికి దాడులు తగ్గడం లేదని, వారం రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో దళితులపై దాడి అగ్రవర్ణాల అహంకారం దోరణి తగ్గలేదు అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ అని AP MRPS రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య అన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు SC.ST అట్రాసిటీతో పాటు 307 సెక్షన్ కేసు నమోదు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అందోళన చేయల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇలాంటి సంఘటణలు పునరావృత్తం కాకుండా న్యాయ శాఖ ప్రత్యేక చోరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎమ్మార్పీఎస్ స్థానిక నాయకులు మరియు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాట్ల డానియల్ మాదిగ, ఎమ్మార్పీఎస్ డివిజన్ ఇంఛార్జి పుప్పాల అనిల్ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.