Andhra
రుణం చెల్లించకపోవడంతో ఫారెస్ట్ సీనియర్ అసిస్టెంట్‌కి జైలు శిక్ష.. కోర్టు తీర్పు
ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురం రేంజీకి చెందిన ఫారెస్ట్ సీనియర్ అసిస్టెంట్ అరేటి వెంకటరమణమ్మకు అప్పు తీసుకుని ఇవ్వక పోవడంతో ఒంగోలు కోర్టు జైలు శిక్ష విధించింది.
వివరాల్లోకి వెళ్తే— సుమారు 8 సంవత్సరాల క్రితం, వెంకటరమణమ్మ.. సోషియల్ ఫారెస్ట్ డివిజన్‌లో పనిచేస్తున్న సమయంలో ఎస్ కె కౌసర్ పర్వీన్ అనే మహిళ వద్ద నుండి రూ. 3 లక్షలు రుణంగా తీసుకున్నారు. ఆ మొత్తం తిరిగి చెల్లించకపోవడంతో, కౌసర్ పర్వీన్ లాయర్ ద్వారా నోటీసు ఇచ్చినా స్పందన లభించలేదు. దీంతో పర్వీన్, ఒంగోలు కోర్టులో కేసు దాఖలు చేశారు. కోర్టు విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం, తేదీ 07-11-2025న అనగా శుక్రవారం అరేటి వెంకట రమణమ్మపై రూ. 5.15 లక్షలు చెల్లించాలని, అదనంగా రూ.10 వేల జరిమానా, అలాగే చెల్లించకపోతే 3 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
![]()
