Connect with us

Andhra

బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్స్ నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక ..

Published

on

మార్కాపురం: భారత సంచార నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య శాంతి భవనంలో గురువారం నాయకులు ఎమ్ .కృష్ణారావు అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా బి. బ్రహ్మానందరెడ్డి, ఆర్ నాగేశ్వరరావు లు హాజరై మాట్లాడుతూ.. పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలని, కొత్తగా వచ్చే పే కమిషన్ లో పెన్షనర్స్ కు వర్తించదని,అలాగే కొత్తగా అనౌన్స్ చేసే డిఏ లో పెన్షనర్స్ ను కలపమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రస్తావించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. పే రివిజన్ బెన్ఫిట్స్ కొత్తగా ప్రకటించే డిఏలు పెన్షనర్స్ కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా ఎం. కృష్ణారావు కార్యదర్శిగా ఎస్ ఏ సలీం, కోశాధికారిగా పి. శంకర్రావు లు ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ నాయకులు అందే నాసరయ్య, నియోజకవర్గ సిపిఐ నాయకులు ఎస్కే కాసిం, నాయకులు మంగయ్య, హుస్సేన్ పీరా, సుభాని, వీరయ్య, జాకోబు తదితర పెన్షనర్స్ పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.