Andhra
అదుపుతప్పి పొగాకు బ్యార్నిని ఢీ కొట్టిన మినీ లారీ..
ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రమత్తులో లారీని నడిపిన డ్రైవరు పొగాకు బ్యార్నిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తో పాటు క్లీనరు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు స్థానికులతో కలిసి 2 గంటలకు పైగా శ్రమించి లారీ క్యాబిన్ లో నుంచి వెలికి తీశారు. అనంతరం ఇద్దరినీ కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భీమవరంలో టమాటా లోడ్ దిగుమతి చేసి తిరిగి అనంతపురం వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగిందని లారీ డ్రైవర్ తెలిపాడు.
![]()
