Andhra
MPJ అనంతపురం సిటీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక..
అనంతపురం: అనంతపురం జిల్లా అనంతపురం సిటీ నూతన కమిటీని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ యంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, రాయలసీమ ఇన్చార్జ్ ఎండి అయూబ్ ఖాన్, అనంతపురం జిల్లా అద్యక్షులు సులేమాన్ షరీఫ్ ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సభ్యుల సమావేశం నిర్వహించి గౌరవ అధ్యక్షులుగా నవాజ్ అహ్మద్, అధ్యక్షులుగా గాజా పీర్, ప్రధాన కార్యదర్శిగా జానె ముహమ్మద్, కోశాధికారిగా షామీర్ బాషా మరియు సభ్యులుగా ఇర్ఫాన్, ఉమర్, ముహమ్మద్ రఫీ, హాసన్, ఫారూఖ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా యంపీజే రాష్ట్ర కార్యదర్శి షేక్ సలీం మాట్లాడుతూ.. అనంతపురం సిటీలో ఉన్న ప్రజల సమస్యలపై నిరంతరం పనిచేయాలని, అలాగే ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య ఒక వారధిగా ఉండి ప్రజల పక్షాన నిలబడి సమస్యలపై, పీడితుల పక్షాన ఉండి పోరాటం చెయ్యాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్షుడు షేక్ జాకీర్ ఉమ్రీ, ప్రొద్దుటూరు ఎంపీజే సభ్యులు ముక్తి యార్, అల్లాబగష్ తదితరులు పాల్గొన్నారు.
![]()
