Connect with us

Andhra

విజన్కు వెలుగు లేదు: వైఎస్ షర్మిల

Published

on

అమరావతి నమూనాలు పెట్టిన గదికి కరెంట్ లేదంటే..మీ విజన్ కే వెలుగు లేదని వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. గతంలో జగన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారన్నారు. కేవలం ఒక్కటి కూడా పూర్తి చేయలేదని ఇప్పటికైనా ఉన్న భూమిని ఉపయోగించుకోవాలన్నారు. మొదట విడత తీసుకున్న భూములకు న్యాయం చేసి రాజధాని నిర్మించండని కోరారు. అసైన్డ్ రైతులకు ఇంకా న్యాయం జరగలేదని మొత్తుకుంటున్నారని చెప్పారు.అమరావతిలో 2015లో మోదీ శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించి మన నోట్లో ఎలా మట్టి కొట్టారో చూద్దామని వచ్చానని వైఎస్ షర్మిల అన్నారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటీవల మళ్లీ అమరావతికి వచ్చి శిలాఫలకం ఆవిష్కరించి వెళ్లారని అమరావతి విషయంలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందని ఎద్దేవా చేశారు. వినటానికి, చూడటానికి చాలా అసహ్యంగా ఉందన్నారు. ప్రజలకు ఇది ఎబ్బెట్టుగా ఉందన్నారు

.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.