Andhra
ఎన్నికల సంఘం పనితీరు మార్చుకోవాలి..పరకాల ప్రభాకర్
విజయవాడ: మేలుకో ఆంధ్రప్రదేశ్ ఆద్వర్యంలో ఎన్నికల సంఘం పనితీరు, SIR అవగాహన సదస్సును విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఎదురుగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు ముఖ్య వక్తగా ప్రముఖ సామాజికవేత్త ప్రకారం ప్రభాకర్, మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వర రావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ముఖ్యవక్త పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. నిష్పక్షపాతంగా ఉండవలసిన ఎన్నికల సంఘం పూర్తిగా ప్రభుత్వానికి లొంగిపోయిందని, గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా అక్రమాలకు పాల్పడిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యంగా రెండు గంటల సమయంలో మూడు లక్షల పైచిలుకు ఓట్లు మూడు వేల పోలింగ్ బూత్ లలో పోలైనట్లు ప్రకటించడం, ఒక వ్యక్తి మూడు సెకన్లలో రెండు ఓట్లు వేయడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు?. అలాగే ప్రజలను విభజించడం, ఇబ్బందులు గురిచేసెందుకే ఎస్ఐఆర్ ప్రక్రియ అని, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు జగరుకులై దీన్ని ఎదుర్కోవాలని పిలుపు ఇచ్చారు.
తదనంతరం ఇర్ఫాన్ ఖాన్ (NCRD), అబ్దుల్ ఖాలిఖ్ (SAFA)లు SIR నుంచి ఓట్లను ఎలా కాపాడుకోవాలో పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో APCR, MPJ, DBF, HRF, SIO, JVV, JIH తదితరు 25కు పైగా ప్రజా సంఘాలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి “మేలుకో ఆంధ్రప్రదేశ్ ‘ కన్వీనర్లు రమేష్ పట్నాయక్, KM అబ్దుల్ సుభాన్, థామస్ తదితరులు కార్యక్రమం సంధాన కర్తలుగా నిర్వహించారు.
![]()
