Connect with us

Andhra

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన MPJ۔۔

Published

on

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎంపీజే ఆధ్వర్యంలో డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మైదుకూరు రోడ్డులోని పాండురంగ స్వామి దేవాలయం దగ్గర ఉన్నా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, ఎంపీజే రాయలసీమ ఇంచార్జి MD అయూబ్ ఖాన్ నివాళులర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ۔۔ దేశానికి సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా హక్కు, రాజ్యాంగం అనే వరాలన్నీ అందించిన మహామనిషి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమాజంలోని “నీ హక్కుల కోసం నిలబడే ధైర్యం నీలో ఉండాలి” అని నేర్పిన నాయకుడు. సమాజంలో అసమానతలను తొలగించడానికి జీవితాంతం పోరాడి, మనం ఈరోజు అనుభవిస్తున్న హక్కులు, స్వేచ్ఛలు ఆయన చూపిన మార్గంలో వచ్చినవే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే పట్టణ అధ్యక్షులు హుస్సేన్ బాష, కార్యదర్శి రఫీ, సభ్యులు ముక్తియార్, ఫర్హాన్, అల్లాబకష్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.