Andhra
బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన మార్కాపురం పోలీసులు..
మార్కాపురం: స్వాతంత్ర్య సమర యోధుడు, దివంగత మాజీ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో బాలల మధ్య ఘనంగా నిర్వహించిన మార్కాపురం సీఐ పి సుబ్బారావు, గ్రామీణ ఎస్ఐ పిఅంకమ్మరావులు. ఈ సందర్భంగా బాల విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తూ.. వారి మధ్యన ఆనందంగా గడిపారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, స్వీట్స్ పంచి పెట్టారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
![]()
