Connect with us

Andhra

జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

Published

on

మార్కాపురం: పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల పూర్వ విద్యార్థి, A1 గ్లోబల్ కళాశాల చైర్మన్ డాక్టర్ మీర్జా షంషీర్ అలీ బేగ్, మార్కాపురం డివిజన్ ఉప విద్యాశాఖధికారి మామిళ్ళపల్లి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా షంషీర్ అలీ బేగ్ మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఉజ్వల భవిష్యత్తును పొందాలని తెలియజేశారు. మార్కాపురం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి శ్రీనివాస రెడ్డి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు చదువు ఎంతగానో ఉపకరిస్తుందని, చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని, వనరులను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ఈసందర్భంగా వివిధ రకాల పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి, క్రీడాకారులలో ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్ధాయిలో ప్రాతినిధ్యం వహించిన విద్యార్థులకు ముఖ్య అతిధుల చేతులమీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.