Andhra
రాష్ట్ర ఉర్దూ ఉత్తమ ఉపాధ్యాయని పురాస్కారం అందుకున్న షేక్ ఖుర్షీద్ బేగం..
విజయవాడ: నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ దినోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలకు అవార్డులను ఇచ్చి సత్కరించింది.
ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ZPH స్కూల్లో పనిచేస్తున్న షేక్ ఖుర్షీద్ బేగంకు ఉర్దూ భాషలో తన సేవలను గుర్తించి ఉర్దూ అకాడమీ వారు రాష్ట్ర ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డును విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో మైనారిటీ శాఖ మంత్రి NMD ఫారూఖ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈమె కవయిత్రి, పలు పుస్తకాలను రచించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ శాఖ సంబంధించిన అధికారులు, పలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత షేక్ ఖుర్షీద్ బేగం తనకు వచ్చిన అవార్డు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
![]()
