Andhra
ఘనంగా విద్యా దినోత్సవం వేడుకలు నిర్వహించిన ప్రొద్దుటూరు MPJ..
ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని కొత్త కొట్టాల ఉర్దూ హైస్కూల్లో ఎంపీజే ఆధ్వర్యంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం దేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 9, 10 తరగతుల పిల్లలకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చరిత్ర గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు మొదటి, రెండో, ముడవా బహుమతి గా హాట్ బాక్స్ లు 6 మందికి అందజేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, అయూబ్ ఖాన్ మాట్లాడుతూ.. దేశంలో అక్షరాస్యతలో మిజోరం 98.2% మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 72.6% చివరి స్థానంలో ఉండడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకొని రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపెట్టాలని కోరారు. గౌరవ అతిథిగా విచ్చేసిన విద్యాశాఖ అధికారి శోభారాణి మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిలు ముందంజలో ఉన్నారని చదువులో అబ్బాయిలు వెనుకబడి ఉన్నారని భవిష్యత్తులో అబ్బాయిలు కూడా విద్యలో రాణించాలని పిల్లలను ఉద్దేశించి అన్నారు. జిల్లా అధ్యక్షుడు జాకీర్ ఉమ్రి మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి సేవ చేసిన సేవలను పిల్లలకు వివరించారు. చివర్లో స్కూల్ హెడ్మాస్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ.. ఎంపీజే సంస్థ వారు చెప్పినట్లు మీరు విద్యలో రాణించి స్కూల్ కు మంచి పేరు తీసుకురావాలని, మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు గుర్తింపుగా ఎంపీజే వారు ఈ కార్యక్రమాన్ని చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు హుస్సేన్ బాష, ఉపాధ్యక్షుడు నజీర్, కార్యదర్శి రఫీ, సభ్యులు ముక్తార్ ఫరహాన్, కోశాధికారి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
![]()
