Connect with us

Andhra

ZPH బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు..

Published

on

మార్కాపురం: స్వతంత్ర భారత దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, భారతరత్న, స్వర్గీయ డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా శతవసంతాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మార్కాపురం నందు ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా జయంతి వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. మౌలానా ఆజాద్ భరతజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ, భారతీయులను ఏకం చేయడంలో ముఖ్యపాత్ర పోషించారని అన్నారు. పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు సైమన్ మౌలానా ఆజాద్ సేవలు వెలకట్టలేనివి విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. పాఠశాల ఉర్దూ ఉపాధ్యాయుడు సయ్యద్ సమీఉల్లా బాష మాట్లాడుతూ.. మౌలానా ఆజాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి, పాత్రికేయుడు, కవి, రచయిత, గొప్ప దేశభక్తుడు, గొప్ప సంఘసంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.