Andhra
ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ పురాస్కారం అందుకోనున్న ఖుర్షీద్ బేగం..
యర్రగొండపాలెం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవాన్నీ పురస్కరించుకొని రాష్ట్రము లోని ఉర్దూ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రకాశం జిల్లా లోని యర్రగొండపాలెం ZPHS ఉర్దూ పాఠశాలలో స్కూల్ ఆసిస్టెంట్ సోషల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి షేక్. ఖుర్షీద్ బేగంకి ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక అయ్యారు. శ్రీమతి ఖుర్షీద్ బేగం ప్రముఖ ఇస్లాం వాద రచయిత్రి. ఆవిడ ఇస్లాం వాదంలో అనేక రచనలు చేశారు. ఆవిడ రచనలు పుస్తక రూపంలో కూడా వెలువడినాయి. ఈ నెల 11న రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
![]()
