Andhra
డాక్టర్ మహబూబ్ వలిని సన్మానించి, సభ్యత్వం ఇచ్చిన జై జవాన్ యూనియన్..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జై జవాన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘ భవనంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి, సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు యోగ్దాన్ సహరా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ వలిని మాజీ సైనికుల యూనియన్ తరపున ఘనంగా సన్మానించారు.
జై జవాన్ యూనియన్ అధ్యక్షులు హరి నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. సమాజ సేవయే లక్ష్యంగా పనిచేస్తున్న డాక్టర్ మహబూబ్ వలీ లాంటి వ్యక్తి మా యూనియన్ లో ఉండటం మాకు గర్వకారణం అని అన్నారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు డాక్టర్ షేక్ మహబూబ్ వలి గారిని యూనియన్ సభ్యులు అందరూ సర్వసమ్మతిగా జై జవాన్ యూనియన్ కమిటీలో సభ్యుడిగా ఎన్నుకున్నారు. డాక్టర్ షేక్ మహబూబ్ వలి గారు మాట్లాడుతూ.. నాకు జై జవాన్ యూనియన్ లో సభ్యత్వం ఇచ్చినందుకు యూనియన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం జై జవాన్ యూనియన్ అధ్యక్షులు హరి నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు రామకృష్ణ, సెక్రటరీ శేష సాయి, హౌసింగ్ బోర్డ్ అధ్యక్షులు చిన్నయ్య, మద్దికుంట్ల కాశయ్యలు డాక్టర్ షేక్ మహబూబ్ వలికి దృశ్యాలువ, పూలమాల వేసి, మెమోంటో ఘనంగా సన్మానించారు.
![]()
