Andhra
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల ఎంపిక పట్ల హెచ్ ఎమ్ హార్షం..
మార్కాపురం: ప్రకాశం జిల్లా ఒంగోలులోని పివిఆర్ స్కూల్ నందు జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ అండర్ 14 లో సత్తా చాటిన మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులను జడ్పీ హైస్కూల్ హెఎమ్ చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.
స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మార్కాపురం నందు చదువుతున్న వి. మహేష్ (100మీ.. పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో, 200మీ.. పరుగు పందెంలో మొదటి స్థానం) మరియు ఎం. అజయ్ (400 & 600 మీ.. పరుగు పందెంలో ద్వితీయ స్థానం ) స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 ప్రకాశం జిల్లా జట్టుకు ఎంపిక అవడం జరిగిందని తెలిపారు. వీరు రేపు శ్రీకాకుళం జిల్లా నందు జరగబోవు రాష్ట్రస్థాయి అండర్ 14 బాలుర విభాగంలో ప్రకాశం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు.
వీరికి శిక్షణ ఇచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు డి.శ్యామల దేవి, పి.దామోదర్ రెడ్డి మరియు కె. ఓబులేసు లను ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది అభినందించారు.
![]()
