Andhra
జడ్పీ బాలుర హైస్కూల్ కు చెందిన ఆరుగురు విద్యార్థులు రాష్ట్ర కబడ్డీకు ఎంపిక..HM హార్షం
కబడి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ బాలుర ఉన్నతపాఠశాల మార్కాపురం విద్యార్థులు ఆరుగురు రాష్ట్ర స్ధాయికి ఎంపిక అయ్యారని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ఒంగోలులో డాక్టర్ ఆనంద్ మినీ స్టేడియం వేదికగా కబడ్డీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అండర్ 14 బాలుర సెలక్షన్స్ నిర్వహించడం జరిగిందని, ఇందులో జిల్లా పరిషత్ బాలురు విద్యార్థులు ఆరుగురు రాష్ట్ర స్ధాయికి ఎంపిక కావడం జరిగింది. ఎంపికైన విద్యార్థులు డేవిడ్, అభి, విష్ణువర్ధన్, నాగరాజు, జస్వంత్ నాయక్, మరియు భానుతేజలను వీరికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు డి.శ్యామలదేవి, పి. దామోదర్ రెడ్డి, కె. ఓబులేసు లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు వై.సైమన్, స్టాఫ్ ట్రెజరర్ జి.యల్.రమేష్ తదితర ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు మార్కాపురం పుర ప్రజలు అభినందించారు.
ఎంపికైనటువంటి విద్యార్థులు ఈనెల 7, 8, 9 తేదీల్లో కర్నూలు జిల్లాలో జరుగు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు.
![]()
