Connect with us

Andhra

సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన డాక్టర్ షేక్ మహబూబ్ వలి..

Published

on

YSS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ వలి చేస్తున్న సమాజ సేవలను గుర్తించి సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సంస్థ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మహబూబ్ వలి గురించి “మీరు చేసే సమాజసేవలో మీ యొక్క దృఢత్వం, మీ నమ్మకం, మాకు అత్యంత ప్రభావితం చేశాయని, మీరు చేస్తున్న ఈ సేవలకు గమనించి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ.. సంతోషిస్తు, హర్షం వ్యక్తం చేస్తున్నాం” అని సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సంస్థ వారు పేర్కొన్నారు.

ఈ నియమకం పట్ల డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ.. ఈనెల 11 వ తారీకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరగబోయే కార్యక్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర గౌరవ పురస్కారాన్ని అందుకోనున్నానని, ఈ అవార్డును సివిల్ పబ్లిక్ సర్వీస్ వెల్ఫేర్ సంస్థ వారు ఎంపిక చేశారని, నియామక పత్రాన్ని నాకు సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సంస్థ వారు అందించనున్నారని, నా మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సంస్థకు ధన్యవాదాలు తెలుపుతూ, ఒక మంచి సమాజం ఏర్పడడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.