Andhra
మహబూబ్ వలిని సన్మానించిన ప్రముఖ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ రాఘవేంద్ర..
మార్కాపురం: యోగానంద సహారా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి, సమాజ సేవకులు డాక్టర్ షేక్ మహబూబ్ వలిని పట్టణంలోని కళ్యాణి కంప్యూటర్ ఇనిస్టిట్యూట్, శ్రీ ఋషి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ యం.వి. రాఘవేంద్ర ఆదివారం నాడు డాక్టర్ షేక్ మహబూబ్ వలి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలసి దృశ్యాలువ, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా రాఘవేంద్ర మాట్లాడుతూ.. మహబూబ్ వలి భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అత్యున్నత సేవ పురస్కారాలు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మహబూబ్ వలి మాట్లాడుతూ.. నిరంతరం పేద ప్రజలకు, పేద విద్యార్థులకు అండగా నిలుస్తానని, తన శక్తి మేరకు పేదలకు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
![]()
