Andhra
మొంథా తుఫాను కారణంగా పోలాల్లో నిలిచిన వర్షపు నీటినీ తొలగిస్తాం.. కలెక్టర్
మార్కాపురం: మొంథా తుఫాన్ ప్రభావంతో పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని వెంటనే తొలిగించే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు.
శనివారం సాయంత్రం మార్కాపురం మండలంలోని నికరంపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డితో కలిసి సందర్శించి దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. అనంతరం వేములకోట, మార్కాపురం చెరువులను పరిశీలించి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మొంథా తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ తుఫాను వలన రికార్డు స్థాయిలో 20 సెంటీమీటర్ల వర్షం నమోదు అయిందని, ఫలితంగా వాగులు, వంకల్లో ప్రవాహం పెరిగి పంట పొలాలు, కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరాయి అన్నారు. కొన్నిచోట్ల రోడ్లు కూడా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకే తాను క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు కలెక్టర్ వివరించారు. జియో కోఆర్డినేట్స్ ఆధారంగా నష్టాలను నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
![]()
