Andhra
తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకొండి.. ఎమ్మెల్యే కందుల అధికారులకు ఆదేశం
మార్కాపురం: మొంథా తూఫాన్ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం వ్యాప్తంగా అధిక మొత్తంలో వర్షపాతం నమోదు నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. నేడు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి మార్కాపురం ఏడిఏ, దర్శి ఏడిఏ, మార్కాపురం, తర్లుపాడు, కొనకకనమిట్ల, పొదిలి మండలాల ఏవోలు, హార్టికల్చర్ అధికారి, వ్యవసాయ శాస్త్రవేత్తలతో తన స్వగృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారితో మాట్లాడుతూ.. దెబ్బతిన్న ప్రతి ఎకరాకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రతి రైతుకు న్యాయం జరగేలా చూడాలని అధికారులకు సూచించారు.
![]()
