Connect with us

Andhra

యోగ్ దాన్ సహార సమితి ఫౌండేషన్ ఏపి అధ్యక్షులుగా మహబూబ్ వలీ..

Published

on

యోగ్ దాన్ సహారా సమితి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ షేక్ మహబూబ్ వలి నియామకం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “నేతృత్వ అనుభవం, మీయొక్క విజయాలు, మరియు సామాజిక సేవ రంగంలో మీరు చేస్తున్న సేవలను గమనించి యోగదనం సహారా సమితి ఫౌండేషన్ కమిటీ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగదనం సహారా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు”. మరియు మీ యొక్క నేతృత్వంలో యోగ్ దాన్  సహారా సమితి ఫౌండేషన్ బాగా అభివృద్ధి చెందుతుండని మేము ఆశిస్తున్నాం అని తెలిపారు. ఈ పదవి రెండు సంవత్సరాల కాల పరిధి ఉంటుంది.

ఈ సందర్భంగా షేక్ మహబూబ్ వలీ మాట్లాడుతూ.. యోగ్ దాన్ సహారా సమితి ఫౌండేషన్ వారు 10 రాష్ట్రాల అధ్యక్షుల పేర్లు ప్రకటిస్తూ .. అందులో నా పేరును రాష్ట్ర అధ్యక్షుడిగా పేర్కొనడంపై సంతోషంగా ఉందని, నామీద నమ్మకంతో ఈ బాధ్యతలు ఇచ్చిన యోగ్ దాన్ సహారా సమితి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వారికి కృతజ్ఞతలు తెలుపారు. అలాగే యోగ్ దాన్ సహారా సమితి ఫౌండేషన్ అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని తెలిపారు. మహబూబ్ వలీ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ శాఖ ప్రకాశం జిల్లా ప్రధానకార్యదర్శిగా, పలు సేవా కార్యక్రమాలకు గాను 106 అవార్డులను పొందడం గమనార్హం. ఆయనకు ఈ పదవి వరించినందుకు స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు‌.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.