Andhra
డాక్టర్ ఉమర్ ముక్తార్ ను సన్మానించిన షేక్ అబ్దుల్ జిలాని..
గుంటూరు: నూర్ భాష /దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో వుడ్ల్యాండ్ హోటల్ నందు రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కె. పీర్ మహమ్మద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా డాక్టర్ ఉమర్ ముక్తార్ ను నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా ఉమర్ ముక్తార్ మాట్లాడుతూ.. తన తండ్రి చమన్ ఏర్పాటు చేసిన సంఘంలో పనిచేయటం గర్వకారణమని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను ఏకం చేసి సంఘం అభివృద్ధికి పాటు పడతానని తెలియజేశారు. ఈ సందర్భంగా కంభం మండలం టిడిపి సీనియర్ నాయకులు షేక్ అబ్దుల్ జిలాని ఆధ్వర్యంలో డాక్టర్ ఉమర్ ముక్తార్ ను ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నూర్ భాషా ఫెడరేషన్ మాజీ చైర్మన్ బాబన్, చాంద్ బాషా, ఖాసిం, న్యామతుల్లా, హుస్సేన్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
![]()
