Andhra
రోడ్డు మార్జిన్ను ఆక్రమిస్తే చర్యలు తప్పవు..సీఐ ప్రభాకర్ రావు
యర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలో ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా స్థలాన్ని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని యర్రగొండపాలెం సిఐ సిహెచ్ ప్రభాకరరావు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం సైకిల్ రైడింగ్ కార్యక్రమం చేపట్టి రహదారుల్లో రోడ్డు మార్జిన్ స్థలాన్ని ఆక్రమించి చిరు వ్యాపారాలు, తోపుడు బండ్లు నిలిపి వ్యాపారులు నిర్వహిస్తున్న వారిని ఆయన హెచ్చరించారు. ఫుట్ పాత్ కు అవతల వైపు మాత్రమే పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవాలి కానీ ఫుట్ పాత్ లను ఆక్రమించి వాహనదారులను, ప్రజలను ఇబ్బంది పెట్టి ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
![]()
