Andhra
మైదుకూరు MPJ నూతన కమిటీ ఏర్పాటు..
మైదుకూరు: కడప జిల్లా మైదుకూరు పట్టణ నూతన కమిటీని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ యంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, రాయలసీమ ఇన్చార్జ్ ఎండి అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సభ్యుల సమావేశం నిర్వహించి మైదుకురు గౌరవ అధ్యక్షులుగా యాఖూబ్ హుస్సేన్, అధ్యక్షులుగా ముహమ్మద్ గౌస్, ఉపాధ్యక్షులుగా అజ్మతుల్లా, రామనంద రెడ్డి, కార్యదర్శులుగా ఎం మున్నా, ఆదం, అర్షద్, అహమ్మద్ సహాయ కార్యదర్శులుగా సలీం, ఆరిఫ్, కోశాధికారిగా అన్వర్ భాష మరియు సభ్యులుగా B.P బాష, ప్రభాకర్, సిద్ధయ్య (సిద్దీక్) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యంపీజే రాష్ట్ర కార్యదర్శి షేక్ సలీం మాట్లాడుతూ.. మైదుకూరు లో ఉన్న ప్రజల సమస్యలపై నిరంతరం పనిచేయాలని, అలాగే ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య ఒక వారధిగా ఉండి ప్రజల పక్షాన నిలబడి సమస్యలపై పోరాటం చెయ్యాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎంపీజే సభ్యులు ముక్తి యార్. గౌస్ లాజం తదితరులు పాల్గొన్నారు.
![]()
