Uncategorized
ఇరాన్ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ, ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించిన ఎస్ ఐ ఓ
ఇజ్రాయిల్ ఇరాన్ పై చేస్తున్న బూటకపు దాడులను ఖండిస్తూ ఇరాన్ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ, ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించిన స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం.ఇరాన్ ప్రజలకు తమ ప్రగాఢ సంఘీభావాన్ని తెలియజేయడానికి, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (SIO) ప్రతినిధి బృందం ఇరాన్ – హైదరాబాద్ కాన్సుల్ జనరల్ శ్రీ మహదీ షారోఖిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరాన్ భూభాగంపై ఇటీవల జరిగిన ఇజ్రాయెల్ దాడులను SIO తీవ్రంగా ఖండిస్తోంది అని, ఇజ్రాయిల్ అంతర్జాతీయ చట్టాలు,దౌత్య నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘిస్తోంది అని తెలియజేస్తూ, అంతర్జాతీయ సమాజ సహకారం ద్వారా శాంతి మరియు స్థిరత్వం గెలుస్తుందని మేము ఆశిస్తున్నాము అని వారు అన్నారు.అదే సమయంలో, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయంతో సన్నిహిత సమన్వయం ద్వారా ఇరాన్‌లోని భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని SIO భారత ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలోఅడ్వకేట్ అనీస్ రెహమాన్ (జనరల్ సెక్రటరీ, SIO), మొహమ్మద్ ఫరాజ్ అహ్మద్ (రాష్ట్ర అధ్యక్షుడు, SIO తెలంగాణ), మొహమ్మద్ హమ్మదుద్దీన్ (కార్యదర్శి) మరియు ఇతర బృంద సభ్యులు ఉన్నారు.
![]()
