Connect with us

Uncategorized

ఇరాన్ పై దాడిని ఖండించిన ముస్లిం దేశాలు

Published

on

ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండిస్తూ 21 అరబ్, ముస్లిం దేశాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఖండిస్తూ.. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం, అణ్వాయుధ నిరాయుధీకరణ, అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించడం కోసం పిలుపునిస్తూ 21 ముస్లిం, అరబ్ దేశాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దేలట్టి చొరవ ఫలితంగా ఈ సంయుక్త ప్రకటన వెలువడింది.ఈ ప్రకటనలో… యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కియే, సౌదీ అరేబియా, సూడాన్, జోర్డాన్, పాకిస్తాన్, బహ్రెయిన్, గాంబియా, అల్జీరియా, బ్రూనై, చాడ్, కొమొరోస్, జిబౌటి, సోమాలియా, ఇరాక్, కువైట్, లిబియా, ఒమన్, ఖతార్, ఈజిప్ట్, మౌరిటానియా దేశాలు ఉన్నాయి. ఇరాన్‌ పై ఇజ్రాయెల్ శత్రుత్వాన్ని వెంటనే నిలిపివేయాలని ఆ దేశాలు పిలుపునిచ్చాయి.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.