Connect with us

Uncategorized

థియేటర్లో ఏం ప్రదర్శించాలో గుండాల చెప్పేది: సుప్రీంకోర్టు

Published

on

తమిళ భాష కన్నడ భాషకు తల్లి వంటిది అని కమల్ చేసిన వ్యాఖ్యలు రచ్చ జరుగుతున్న వేళ కర్ణాటక కోర్టులో విచారణ జరుగుతున్న ఈ కేసు విచారణను తమకు బదిలీ చేసుకున్న సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. కమల్ ను సారీ చెప్పమని కోరే అధికారం మీకు ఎక్కడుందని ఈ సందర్భంగా హైకోర్టుకు చీవాట్లు పెట్టింది. అలాగే కమల్ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆయన సినిమా ప్రదర్శించే థియేటర్లు తగులబెడతామన్న హెచ్చరికలు చేయడమేంటని ప్రశ్నించింది. కమల్ వ్యాఖ్యలు చేస్తే మీరు కూడా కౌంటర్ ఇవ్వండి, అంతే కానీ ఈ హెచ్చరికలేంటని ఆక్షేపించింది.మూక బెదిరింపులకు చట్ట బద్ద పాలనను తాకట్టు పెట్టలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. థియేటర్లలో ఏమి ప్రదర్శించాలో గూండాల సమూహాలు నిర్ణయించడానికి అనుమతించలేమని కూడా హెచ్చరించింది.కమల్ వ్యాఖ్యలతో విభేదించే హక్కు కర్నాటక ప్రజలకు ఉందని, అదే సమయంలో ఆయన ప్రాథమిక హక్కును కూడా పరిరక్షించాల్సిందేనని స్పష్టం చేసింది.ఒక వ్యక్తి ఒక ప్రకటన చేసినప్పుడు అందరూ అందులో జోక్యం చేసుకున్నప్పుడు వ్యవస్థలో ఏదో లోపం ఉందని తెలిపింది. అనంతరం ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెన్సార్ బోర్డు ఓ సినిమాకు అనుమతి ఇచ్చాక, దాన్ని చూడాలా వద్దా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారని, కానీ విడుదల కాకుండా చేసే హెచ్చరికలు తప్పని పేర్కొంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.