War
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో బాంబుల వర్షం
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్‌లోని టెహ్రాన్ పరిసర ప్రాంతాలపై దాడులకు తెగబడుతోంది. అణు స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ప్రతి దాడులకు సిద్ధమవుతోంది. దీంతో ఇజ్రాయెల్‌లో ముందు జాగ్రత్త చర్యగా అత్యవరసర పరిస్థితిని ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇరాన్‌పై వైమానిక దాడులతో (Israeli airstrike on Iran) ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. శుక్రవారం టెహ్రాన్‌లోని ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో అమెరికా (America) విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో స్పందించారు. ఈ దాడులతో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తమ దేశానికి చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. అలాగే తమ బలగాలను కాపాడుకోవడమే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఇదిలావుండగా ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ముందుగానే హెచ్చరించారు. దాడులు చేయొద్దంటూ ఇజ్రాయెల్‌కు సూచించారు. అయినా ట్రంప్ సూచనలను ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టి దాడులు చేసింది.
మరోవైపు ఈ దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టం వాటిల్లిందని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్ టెహ్రాన్ వేదికగా అణు సంబంధిత కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడింది. అణు స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసింది. శుక్రవారం వేకువజాము టెహ్రాన్‌లో పేలుళ్ల శబ్ధాలు వినిపించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ దాడితో మున్ముందు మరిన్ని దాడులు, ప్రతిదాడులు జరగే అవకాశం ఉందని తెలుస్తోంది
![]()