అమెరికాకు చెందిన విమాన వాహక నౌక అబ్రహాం లింకన్ లక్ష్యంగా ఇరాన్ మరోసారి క్షిపణి దాడులు చేసింది. ఈ విమాన వాహకనౌక కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నామని, దాన్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన గంటలోపే టార్గెట్ చేసింది. ఈ మేరకు దానికి సంబంధించిన వీడియోను ఇరాన్ సోషల్ మీడియాలో విడుదల చేసింది